Listen & view Usha - Ne Toli Sariga lyrics & tabs

Track : Ne Toli Sariga

Artist : Usha

Album : Unknown

Ne Toli Sariga by Usha from album Unknown

Duration : 4 minutes & 51 seconds.

Listener : 10 peoples.

Played : 40 times and counting.

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా ...
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా ...
రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా ...
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా ...
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచి గల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరునవ్వుల దగా
కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా ...
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా ...
పంతమా ... బంధమా ...
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా ...
(దిలీప్ చక్రవర్తి)

You may also like

Loading Time :0.17636895179749mem :524288